సర్ ప్రక్రియ పరిశీలించిన బోధన్ ఆర్ డిఓ..
బోధన్ రూరల్, ఆంధ్రప్రభ : ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని బోధన్ ఆర్డీఓ విజయకుమారి పరిశీలించారు. పట్టణంలోని 6వ వార్డులో పర్యటించిన ఆమె, ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేసి, ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలను మొబైల్ యాప్ ద్వారా నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.
