జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలవాలి…
బిక్కనూర్, ఆంధ్రప్రభ ; జర్నలిస్టులో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలువాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షునిగా నియమితులైన రవికుమార్ ను ఆయన అభినందించారు. అనంతరం మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని చెప్పారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చే పరిష్కారానికి జర్నలిస్టు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ప్రభుత్వపరంగా జర్నలిస్టులకు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, జర్నలిస్టులు బాల ప్రకాష్, మహేష్ కుమార్, పరశురాం గౌడ్, శేఖర్ గౌడ్ ఉన్నారు.
