మెడికల్ కాలేజీని ప్రారంభించిన ఎమ్మెల్యే యరపతినేని

మెడికల్ కాలేజీని ప్రారంభించిన ఎమ్మెల్యే యరపతినేని

పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ:
పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం నూతనంగా మెడికల్ కాలేజీకి ఎంపికైన స్టాఫ్‌కు నియామక పత్రాలను ఎమ్మెల్యే శ్రీనివాసరావు అందజేశారు.

ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ జిల్లా అధికారులు, డివిజన్ స్థాయి పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక మెడికల్ కాలేజీ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. పిడుగురాళ్ల పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావుతో పాటు పిడుగురాళ్ల మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.