అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్
అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్
బాపట్ల, ఆంధ్రప్రభ: బాపట్ల పురపాలక సంఘం కమిషనర్ ఎం. హాసిని మంగళవారం ఉదయం అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా సందర్శించి పరిశుభ్రత, ఆహార నాణ్యతను పరిశీలించారు.
ఈ సందర్భంగా క్యాంటీన్ సిబ్బందితో మాట్లాడి రోజువారీ నిర్వహణ, ఆహార సరఫరా, పరిశుభ్రత చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడ అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కమిషనర్ హాసిని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.ఎస్.ఆర్. కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ చల్ల శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ చేవూరి కరుణ తదితరులు పాల్గొన్నారు.
