Stock Market | మార్కెట్లు గ్రీన్‌లో.. నిఫ్టీ 23,150 పైన

Stock Market | మార్కెట్లు గ్రీన్‌లో.. నిఫ్టీ 23,150 పైన

Stock Market | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పెట్టుబడిదారుల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.

ఉదయం 11 గంటల సమయానికి నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 23,152 వద్ద కొనసాగుతోంది. మరోవైపు సెన్సెక్స్ 67 పాయింట్లు పెరిగి 73,588 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు గత సెషన్‌లో సానుకూల ముగింపునిచ్చాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.3 శాతం లాభపడగా, టెక్నాలజీ షేర్ల మద్దతుతో నాస్‌డాక్ 0.86 శాతం పుంజుకుంది. దీంతో ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 93.4 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు అమెరికా డాలర్ ఇండెక్స్ 99.95 వద్ద ఉండగా, అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.55 శాతానికి చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల కదలికలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై సంకేతాలు రానున్న రోజుల్లో మార్కెట్ దిశను ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Reply