Bandla Ganesh | పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బండ్ల గణేష్ భావోద్వేగ నిర్ణయం!
Bandla Ganesh | పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బండ్ల గణేష్ భావోద్వేగ నిర్ణయం!
Bandla Ganesh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నిర్మాత బండ్ల గణేష్ తన మంచి మనసు చాటుకున్నారు. పవన్ కళ్యాణ్‌ను దేవుడిలా భావించే ఆయన, తన గురువు అడుగుజాడల్లో నడుస్తున్నారు. హన్మకొండకు చెందిన 17 ఏళ్ల పొనుగోటి నిరంజన్ తీవ్ర కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నేడు పరామర్శించారు. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన నిరంజన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసి ఆయన చలించిపోయారు.
పవన్ కళ్యాణ్.. నిరంజన్‌ను పరామర్శించిన అనంతరం, బండ్ల గణేష్ వెంటనే ఆ యువకుడి వైద్య ఖర్చుల నిమిత్తం తన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బండ్ల గణేశ్ ఇప్పుడే కాదు, గతంలో కరోనా సమయంలోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేశారు. చిత్ర పరిశ్రమకు చెందిన కార్మికులకు, ప్రొడక్షన్ బాయ్స్‌కు అండగా నిలిచేవారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుల సందర్భాల్లో పేదలకు అన్నదానాలు, ఆర్థిక సహాయాలు చేయడం ఆయనకు ఒక అలవాటుగా మార్చుకున్నారు.
కాగా, పవన్ అభిమానిపై బండ్ల గణేష్ చూపిన ఈ ఆప్యాయతకు మరియు ఉదారత్వానికి పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

