ishan kishan | ఇ’షాన్‌దార్’ సెంచ‌రీ

ishan kishan | ఇ’షాన్‌దార్’ సెంచ‌రీ

అఫ్గాన్‌పై ఇషాన్ కిష‌న్ సెంచ‌రీ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లక్నో వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిష‌న్ కూడా సెంచ‌రీ తో చెల‌రేగాడు. అంత‌కుముందు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అద్భుత శతకం చేయ‌గా.. ఆ వెంట‌నే ఇషాన్ కిష‌న్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ 71 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సుల‌తో సెంచరీ చేశాడు. అలాగే కెప్టెన్ గిల్ 12 ఫోర్లు, 2 సిక్సుల‌తో 78 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. బాధ్యతాయుతమైన ఆటతో పాటు దూకుడైన షాట్లతో గిల్‌, ఇషాన్ కిష‌న్ సెంచ‌రీలు చేసి టీమిండియాను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నారు.

టాస్‌ గెలిచిన అఫ్గానిస్థాన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్‌ కేవలం 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఇద్దరూ ఆరంభం నుంచే అఫ్గాన్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అర్ధశతకానికి చేరువైన రోహిత్‌ శర్మ 48 పరుగుల వద్ద రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. అయితే గిల్‌ మాత్రం తన దూకుడును కొనసాగించాడు.

ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌తో కలిసి గిల్‌ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇషాన్‌ కూడా వేగంగా పరుగులు సాధిస్తూ మంచి సహకారం అందించడంతో గిల్‌ తన శతకాన్ని పూర్తి చేశాడు. తొలి వన్డేలోనూ జట్టుకు అండగా నిలిచిన గిల్‌, రెండో మ్యాచ్‌లో మరోసారి తన క్లాస్‌ను చాటుకున్నాడు.