Badawat Santosh | ఎరువుల పంపిణీలో అలసత్వం వద్దు

Badawat Santosh | ఎరువుల పంపిణీలో అలసత్వం వద్దు
- అలా చేస్తే.. చర్యలు తప్పవు
- యూరియాను ఒకే దగ్గర నిలువ చేయడంపై కలెక్టర్ ఆగ్రహం
- నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
Badawat Santosh | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎరువుల పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం, యూరియా లభ్యత, సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ… రైతుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సరఫరాలో జాప్యం చేయకుండా చూడాలని, ఎక్కడ యూరియా సమస్య తలెత్తకుండా, ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా నిలువలనునమోదు చేయాలని, రైతులకు అవసరమైన యూరియా సరఫరాను అందించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసి పకడ్బందీ చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

పెద్దకొత్తపల్లి వ్యవసాయ కేంద్రంలో యూరియాను ఒకే దగ్గర డంపు చేయడంపై సంబంధిత అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత నిల్వలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని, హోల్ సేల్, రిటైల్ డీలర్లు, సహకార సంఘాల గోదాములలో రోజువారి యూరియా స్టాక్ ను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ జిల్లా స్థాయిలో సమన్వయం చేసుకొని మండలాల్లో గ్రామాల వారీగా అవసరానికి అనుగుణంగా కేటాయింపు చేయాలని సూచించారు. అధిక ధరలకు విక్రయించే లేదా ఇతర ఉత్పత్తులతో ప్రైవేట్ డీలర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

పారిశ్రామిక అవసరాలకు సబ్సిడీ యూరియా మళ్లించే అవకాశమున్న యూనిట్లపై తనిఖీలు చేసి, వారి ఉత్పత్తి గణాంకాలు, బిల్లులు సరిపోల్చి ఏమైనా పెద్ద వ్యత్యాసం ఉంటే డీలర్ అండ్ యూనిట్‌పై కేసులు నమోదు చేయాలన్నారు. యూరియా వినియోగాన్ని సమీక్షించేందుకు రోజువారీగా రైతుల యూరియా కొనుగోలుకు ప్రాధాన్యత అనుగుణంగా, కొనుగోలుదారులు, తరచుగా కొనేవారు, అధికంగా అమ్మిన రిటైలర్ల వివరాలను తనిఖీ చేయాలని మండల వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట పెద్దకొత్తపల్లి తాహసీల్దార్ శ్రీనివాసులు, మండల వ్యవసాయ అధికారి వ్యవసాయ అధికారులు తదితరులున్నారు.
