Mahaboobnagar | భారత రాజ్యాంగం పుస్తకంతో సర్పంచ్ ఊరేగింపు

Mahaboobnagar | భారత రాజ్యాంగం పుస్తకంతో సర్పంచ్ ఊరేగింపు

  • అట్టహాసంగా ప్రమాణ స్వీకారం

Mahaboobnagar | మక్తల్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగం పుస్తకాన్ని చేత పట్టుకొని తన పాలకవర్గ సభ్యులతో పాటు మద్దతుదారులతో భారీ ఊరేగింపుగా పంచాయతీ కార్యాలయానికి చేరు కొని అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ గ్రామ సర్పంచ్ కె .రాజేందర్ గౌడ్ ముందుగా గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి(Sri Anjaneya Swamy) దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించి మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం దేవాలయం నుండి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు డప్పు మేళాల తో భారీ ఊరేగింపుగా తరలివచ్చారు. ముందుగా ఆయన తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల వద్ద ఆశీర్వాదం తీసుకొని రాజ్యాంగ పుస్తకంతో ప్రమాణస్వీకారం చేశారు. స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ సర్పంచ్ గా రాజేందర్ గౌడ్, ఉప సర్పంచ్ గా కురువ సాబెన్న వార్డు సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కె .రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగానికి లోబడి సర్పంచ్ గా పని చేస్తానన్నారు. మంథన్ గోడ్ గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని అన్నారు. పంచాయతీ పరిధిలో ప్రజలకు సేవ చేయడం కర్తవ్యంగా భావిస్తున్నానని అన్నారు.

రాజ్యాంగానికి(Constitution) లోబడి సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు కృషి చేస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామంలో మౌలిక వసతులు కల్పించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి జిల్లాలోనే మంథన్ గోడ్ గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు.

అందుకు గ్రామస్తులందరి సహకారం కావాలని ఆయన అభ్యర్థించారు. అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తనను ఆదరించి సర్పంచ్ గా గెలిపించిన ప్రతి ఒక్కరికి సహకరించిన కాంగ్రెస్ నాయకులకు మద్దతు ధరలకు సర్పంచ్ రాజేందర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల పదవీకాలంలో నిస్వార్ధంగా నిజాయితీగా గ్రామ అభివృద్ధికి(village development) అంకితభావంతో పనిచేస్తానని రాజ్యాంగంపై ప్రమాణం చేశారు.

అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్ రాజేందర్ గౌడ్ ను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు తన కుటుంబ సభ్యులు మాజీ సర్పంచ్ శకుంతలమ్మ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్, కృష్ణయ్య గౌడ్ తదితరుల తో ఆశీర్వాదం అందుకున్నారు.

వేద పండితుల ఆశీర్వచనం అందించగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గా కె.రాజేందర్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, నాయకులు కె. ఆంజనేయులు గౌడ్, కోళ్ళ వెంకటేష్, మేదరి శ్రీనివాస్, పసుల రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.