Balka Suman | పోలీసులను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు

Balka Suman | పోలీసులను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు
Balka Suman | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అయితే పోలీసులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటీవల ఓ కార్యక్రమంలో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించి అందిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
