కడప – ఎన్టీఆర్ స్థాపించిన పసుపు జెండాకు 43 ఏళ్లు.. తెలుగుజాతి మొత్తం ఆరాధించే ఏకైక నేత ఎన్టీఆరే అన్నారు టీడీపీ అధితే, ఏపీ సీఎం చంద్రబాబు.. కడపలో జరుగుతున్న మహానాడులో రెండో రోజు చంద్రబాబు మాట్లాడుతూ.. మళ్లీ జన్మ ఉంటే తెలుగు గడ్డపై పుడతా అన్నారు.. కార్యకర్త నా హై కామెండ్ కార్యకర్తె సుప్రీం.. తొలిసారిగా 65 మంది యువత కు సీట్లు ఇచ్చాం.. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచారు.. లోకేష్ 6 శాసనాలు ప్రవేశ పెట్టారు.. ఆయనకు ఉన్న నాలెడ్జితో మంచి ఆలోచనలు చేస్తున్నారు అని ప్రశంసలు కురిపించారు..
కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు లో రెండో రోజైన నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా సభా వేదికపై ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి పండగ రోజు.. ఒక వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదన్నారు సీఎం చంద్రబాబు.. . తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్టుగా ఎన్టీఆర్ ఎదిగారు. నీతి, నిజాయతీ, పట్టుదల ఆయన ఆయుధాలుగా అభివర్ణించారు.. 33 ఏళ్లు వెండితెరకు.. 13 ఏళ్లు రాజకీయాల్లో అద్వితీయ చరిత్ర సృష్టించారని ప్రశంసలు కురిపించారు.. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా.. రైతులకు నేస్తం. అధికారం అంటే బాధ్యత.. పదవి అంటే సేవ అని నిరూపించారని గుర్తుచేశారు.. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్.. పాలకులు అంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్నే మార్చిన వ్యక్తి ఆయన అని కొనియాడారు చంద్రబాబు..
టీడీపీ కొత్తతరహ పరిపాలన కు శ్రీకారం చుట్టింది.. ఎప్పటికి అప్పుడు ప్రజాఅభిప్రాయం తీసుకుంటున్నాము.. కార్యకర్తలే అధినేతలుగా మహానాడు నిర్వహిస్తున్నాం అన్నారు చంద్రబాబు.. కొన్ని నియోజకవర్గాల్లో ఓడినా మెజార్టీ వచ్చిందన్నారు.. అయితే, ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంతవరకు ప్రజలకు ఎన్టీఆర్ గుర్తుంటారు. తెలుగు ప్రజల నమ్మకం, విశ్వాసం, భరోసా.. టీడీపీ జెండా అన్నారు చంద్రబాబు..