మహానాడులో ఏకగ్రీవంగా ఎన్నిక
ఇప్పటికే 30 ఏళ్లుగా అదే పదవిలో చంద్రబాబు
మరో రెండేళ్ల పాటు ఆయనే అధ్యక్షుడు
కడప – తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఇప్పటికే ఆయన ఆ పదవిలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1995 లో తొలిసారి పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన అప్పటి నుంచి కొనసాగుతునే ఉన్నారు. టీడీపీ అధ్యక్ష ఎన్నిక ప్రతి రెండేళ్లకొకసారి జరుగుతుంది. 2014 రాష్ట్ర విభజన వరకు పార్టీ అధ్యక్షునిగా ఆయన ఉన్నారు. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
కాగా నేడు మహానాడులో పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకొనేందుకు నోటిఫికేషన్ విడుదల అయింది. మొదట అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగిన తర్వాత మిగిలిన కార్యవర్గం ఏర్పాటు అవుతుంది. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అధ్యక్షపదవి ఏకగ్రీవం అవుతూనే ఉంది.
ఇక పార్టీ అధ్యక్షపదవికి చంద్రబాబు ఒక్కరే నామినేషన్ వేశారు.. దీంతో ఆయనను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు..