గృహిణి అదృశ్యం

గృహిణి అదృశ్యం

ఎడపల్లి, ఆంధ్రప్రభ: ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన అనపర్తి రజిత(26) అనే వివాహిత ఈ నెల 25వ తేదీ నుండి కనబడకుండా పోయిందని ఎడపల్లి ఎస్సై రమ మంగళవారం తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాల క్రితం సిద్దిపేట జిల్లా కల్వకుంట్ల గ్రామానికి చెందిన కాలువ నాగరాజు అనే వ్యక్తి తో వివాహం కాగా, గత ఆరు సంవత్సరాల క్రితం నుండి తల్లితండ్రుల వద్దనే ఉంటుందని కుటుంబీకులు పిర్యాదు లో పేర్కొన్నారు. రజితకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లి అనపర్తి కుమారి పిర్యాదు తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు

Leave a Reply