కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లి..

ప్రమాదవశాత్తు యువకుడు మృతి

బెల్లంపల్లి,మే4(ఆంధ్రప్రభ): కాసిపేట మండలం దేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ అడవి ప్రాంతంలో గుంటూరులో చేపలు పట్టి ఎందుకు వెళ్లి 16సంవత్సరాల వయసు గల ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెందాడు.మృతుని తండ్రి ఆత్రం బొజ్జి రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై అరికిల్ల గంగారాం తెలిపిన వివరాల ప్రకారం వెంకటాపూర్ అడవి ప్రాంతంలో జంతువుల కొరకు ఏర్పాటు చేసిన కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లి తిర్యాణి మండలం చిన్న అరటిపల్లి గ్రామానికి చెందిన మడావి సు రేష్ (16) అనే యువకుడు మరికొందరు కలిసి చేపలు పట్టేందుకు కుంట వద్దకు వెళ్లారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో కుంట లో సురేష్ మృతి చెంది ఉన్నాడని ఎస్సై పేర్కొన్నారు. సురేష్ వారం రోజుల క్రితం అతని బంధువైన వెంకటాపూర్ కు చెందిన ఆత్రం గోదుబాయి ఇంటికి వచ్చాడని తెలిపాడు. చేపలు పట్టేందుకు ఆదివారం కుంట వద్దకు కొందరి తో కలిసిసురేష్ వెళ్లాడని తెలిపారు.కుంట లో చేపలు చేపట్టిందుకు వెళ్లిన సురేష్ కుంట లో మునిగి పోయి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.