Atrocious | రూ.24 వేల కోసం…

Atrocious | రూ.24 వేల కోసం…
Atrocious | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.24 వేల బాకీ వివాదంలో రాజా, ఫరా అనే దంపతులను వారి ముగ్గురు పిల్లల కళ్లముందే కిరాతకంగా హత్య చేశారు.
ఈ ఘటనలో రాజా మృతదేహానికి సుమారు 40 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఈ దారుణం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు నిందితులు ఫహీం, అనాస్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ఆరిఫ్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
