At 10:30 | ఊగిసలాటలో వెండి ధరలు

At 10:30 | ఊగిసలాటలో వెండి ధరలు
At 10:30 | దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల మార్పులు
ప్రధాన నగరాల్లో తాజా గోల్డ్ రేట్లు
వెండి ధరల తాజా ట్రెండ్
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం
పెట్టుబడిదారుల దృష్టి సురక్షిత ఆస్తులపై
At 10:30 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మార్కెట్‌లో అస్థిరత కనిపిస్తూ, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇవాళ ఉదయం 10:30 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం.. భారతదేశంలో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.15,145 ఉండగా.. 22 క్యారెట్ల గ్రాము ధర రూ.14,185గా ఉంది. ఇక, 18 క్యారెట్ల గ్రాము పసిడి ధర రూ.11,606కు చేరుకుంది. గ్రాము వెండి రూ.265గా, కిలో వెండి రూ.2,65,00గా ఉంది.
బంగారం ధరలు.. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,900గా, 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,42,000గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,750కి, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,41,850కి చేరుకుంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,460 ఉండగా.. 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,42,500గా ఉంది. ఇక, హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,750 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.1,41,850గా ఉంది. విజయవాడ, విశాఖ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,750కి చేరుకోగా.. 22 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.1,41,850కి చేరుకుంది.

వెండి ధరలు.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,65,000గా ఉంది. చెన్నైలో కేజీ వెండి రూ.2,75,000, ముంబైలో రూ.2,65,000గా ఉంది. ఇక, హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి రూ.2,75,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
ధరల మార్పులకు ప్రధాన కారణం అంతర్జాతీయ పరిస్థితులేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ విరమణ చర్చలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తులపై ఆసక్తి చూపుతున్నారు.
అదనంగా డాలర్ విలువ మార్పులు, వడ్డీ రేట్లపై అంచనాలు, గ్లోబల్ ద్రవ్యోల్బణ పరిస్థితులు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రోజుకోలా మారుతున్న ఈ వోలాటిలిటీ కారణంగా బంగారం ధరలు ఒకరోజు పడిపోతే, మరుసటి రోజు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
వివిధ నగరాల్లో స్థానిక పన్నులతో కలిపి పైన సూచించిన ధరల్లో మార్పులు-హెచ్చు తగ్గులు ఉండొచ్చు. గమనించగలరు.
