*కూలీ*లో క‌ళ్యాణి పాత్ర‌లో అదుర్స్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన పాన్ ఇంటియా మూవీ “కూలీ”(Coolie) ఇటీవ‌ల విడుదలై సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకొని క‌లెక్ష‌న్ల ప‌రంగా దూసుకుపోతోంది. అయితే ఈ మూవీలో హేమాహేమీలు న‌టించారు. ర‌జ‌నీకాంత్‌, నాగార్జున‌, ఉపేంద్ర‌, స‌త్య‌రాజ్‌, ఆమీర్‌ఖాన్‌, శృతిహాస‌న్ (Nagarjuna, Upendra, Satyaraj, Aamir Khan, Shruti Haasan)లాంటి స్టార్లు ఉన్నారు. వీరంతా ఒక ఎత్తు అయితే ఇందులో మ‌రో న‌టిని గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ సినిమాలో నెగెటివ్ రోల్ పోషించి మెప్పించిన క‌న్న‌డ న‌టి ర‌చితా రామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. “కూలీ” సినిమాలో ‘కళ్యాణి’ (‘Kalyani’ in the movie ‘Coolie’) అనే పవర్‌ఫుల్ నెగటివ్ పాత్రలో మెరిసిన ఆమె నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున(Nagarjuna) లాంటి గ్రేట్ పెరఫార్మెర్స్ ని కూడా డామినేట్ చేసింది. సినిమాలో మొద‌ట ఆ పాత్ర‌ను చూసిన వారు చాలా అమాయ‌కురాలిగా క‌నిపించింది. ఇంట‌ర్‌వెల్‌ త‌ర్వాత ఆమె విల‌నిజంలో విశ్వ‌రూపం చూపించింది. సినిమాలో నాగార్జున కొడుకును మోసం చేయ‌డంతో మొద‌లైన ఆమె పాత్ర‌… క్లైమాక్స్ వ‌ర‌కు అద్భుతం అనిపించింది. ‘కళ్యాణి’ అనే పాత్ర లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో అందరిని ఆశ్చర్యప‌రిచింది. ఈ అమ్మడి నటనకు థియేటర్లలో క్లాప్స్ కూడా కొడుతున్నారు. ఆవిడ క్యారెక్టర్, ఇచ్చే ట్విస్టులను చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు. రచితా రామ్ అసలు ఎవరు..? అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు నెటిజన్స్.

తెలుగులో ఒక సినిమాలో..
కళ్యాణ్ దేవ్ గుర్తున్నారా? మెగాస్టార్ చిరంజీవి ఇంటి అల్లుడిగా ఉన్న రోజుల్లో అతను కొన్ని సినిమాలు చేశారు. అందులో ‘సూపర్ మచ్చి’ కూడా ఒకటి. ఇందులో రచితా రామ్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఆమె నటించిన ఏకైక సినిమా ఇదే. అయితే కన్నడలో మాత్రం రచిత పాపులర్ హీరోయిన్. పునీత్ రాజ్ కుమార్, ఉపేంద్ర, సుదీప్, ధ్రువ్ సర్జా, దర్శన్, శివరాజ్ కుమార్, దర్శన్ తదితర హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కన్నడ ఆడియెన్స్ ఈ బ్యూటీని ముద్దుగా డింపుల్ క్వీన్ అని పిల్చుకుంటారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్నకన్నడ హీరోయిన్ కూడా రచితానే. ప్రస్తుతం ఆమెకు 2.6 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు. రచితకు నిత్యా రామ్ అనే సిస్టర్ కూడా ఉంది. ఆమె కన్నడ సీరియల్స్ చేస్తోంది.

రచితా రామ్ ఎవరు?
1992, అక్టోబర్ 3న బెంగళూరులో జన్మించిన రచితా రామ్ అసలు పేరు అర్చితా రామ్. ఆమె తండ్రి కే.ఎస్. రామ్ ఒక ప్రఖ్యాత భారతనాట్య కళాకారుడు. చిన్నప్పటి నుంచి నృత్యంపై ఆసక్తి ఉన్న రచితా, 50కి పైగా స్టేజీ షోలలో పాల్గొనడం జరిగింది. నాట్యం మీద ఉన్న ఆసక్తి ఆమెలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ స్కిల్స్‌ను కూడా పెంచింది.

టీవీ నుంచి సిల్వర్ స్క్రీన్ ప్రయాణం..
రచితా కెరీర్ 2011లో టెలివిజన్ ద్వారా మొదలైంది. ఆమె తొలి సీరియల్ ‘Benkiyalli Aralida Hoovu’ కాగా, 2013లో విడుదలైన ‘బుల్ బుల్’ సినిమాతో ఆమె కన్నడ చిత్రసీమలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. అప్పటి నుంచే ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. కన్నడలో రచ్చితా రామ్ “డింపుల్ క్వీన్”గా పేరొందింది. ఆమె ఉపేంద్ర, దర్శన్, గణేష్, సుదీప్, పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. రంగీలా, రన్నా, చక్రవ్యూహ, సీతారాం కళ్యాణ వంటి హిట్ మూవీలతో బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసింది. ఇప్పటికే కన్నడలో స్టార్ స్టేటస్‌ను అందుకున్న రచితా, కోలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. “కూలీ” లాంటి బిగ్ ప్రాజెక్టుతో ఆమెకి తమిళ పరిశ్రమలో మంచి బ్రేక్ లభించింది. త్వరలోనే తెలుగులో కూడా ఆమెకి మంచి అవకాశాలు రానున్నాయి.

Leave a Reply