Intelligence | ఏఎస్ఐ హఠాన్మరణం

Intelligence | ఏఎస్ఐ హఠాన్మరణం
Intelligence | అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఇంటెలిజెన్స్ విభాగంలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బాసాని మహేష్ బాబు గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున అకాల మరణం చెందారు. విధుల్లో నిజాయితీ, నిబద్ధత, తన వ్యక్తిత్వంలో సౌమ్యత, క్రీడల పట్ల మక్కువ, మిత్రుల పట్ల అనురాగం వల్ల అందరితోనూ సన్నిహిత్యం పెంచుకున్న మహేష్ బాబు (Mahesh Babu) మరణ వార్త సహచరులు, క్రీడాకారులలో, మిత్రుల్లో తీవ్ర వేదనకు గురిచేసింది. మహేష్ బాబు మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే పలువురు పోలీస్ అధికారులు, స్నేహితులు, క్రీడాకారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తన భౌతిక కాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. చిన్నతనం నుండి షటిల్, బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడాకారుడైన మహేష్ బాబు క్రీడలను ప్రోత్సహిస్తూ, తల్లిదండ్రుల పేరిట మెమోరియల్ టోర్నమెంట్లు నిర్వహించడమే కాక చాలామందిని క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. ప్రతి శివరాత్రి తన స్వగ్రామం దోమల పెంటలో తన తల్లిదండ్రుల పేరిట అన్నదానం నిర్వహించేవాడు.

“మా మిత్రుడు, ఆత్మీయ సోదరుడు బాసాని మహేష్ బాబు ఏఎస్ఐ (ASI) (ఇంటెలిజెన్స్) గుండెపోటుతో అకాల మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, పెద్దఎత్తున బంధువులు, మిత్రులు, సహచరులు, క్రీడాభిమానులు హాజరై ఆయన బౌతికకాయనికి నివాళులు అర్పించారు.
