Amaravati capital city | కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు

Amaravati capital city | కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు

Amaravati capital city | అమరావతికి ఐకానిక్ ప్రవేశద్వారం ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు
13వ జాతీయ రహదారితో అనుసంధానంపై అధికారుల దృష్టి
అంతర్జాతీయ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యం
మూడేళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా అడుగులు

Amaravati capital city | అమరావతి, ఆంధ్రప్రభ: అమరావతి రాజధాని ముఖద్వారాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి ఏ ప్రాంతం నుంచైనా రాజధాని అమరావతిలోకి ప్రవేశించాలంటే ఒక ముఖద్వారం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసింది.

అందులో భాగంగా మూలపాడు ప్రాంతాన్ని ముఖద్వారంగా అభివృద్ధి చేసేందుకు భారీగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధునాతనమైన బ్రిడ్జి ఏర్పాటుకు ప్లాన్లు తయారు చేయాలని సీఆర్డీఏ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 2016లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బ్రిడ్జిని నిర్మించాలని నిర్ణయించారు.

అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా..

అమరావతి నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మూలపాడు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ ప్రవేశద్వారం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో కొలువుదీరడంతో అమరావతి రాజధాని నిర్మాణానికి ఊపు వచ్చింది. అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి చేతుల మీదుగా పునఃప్రారంభోత్సవం జరిపి, పనులు మొదలుపెట్టారు.

మరోవైపు, అమరావతి ముఖద్వారంగా మూలపాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని కూడా యోచిస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది.

అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, క్రికెట్ స్టేడియం వంటి నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

ఈ క్రమంలోనే రాజధాని అమరావతి ముఖద్వారంగా మూలపాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అమరావతి ముఖద్వారంగా మూలపాడును ఎంపిక చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూలపాడు ప్రాంతంలో ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని ఇప్పటికే ప్రణాళికలు రచించారు. తాజాగా అమరావతి ప్రధాన ప్రవేశద్వారంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు ప్రాంతం విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో దీనినే ప్రధాన ప్రవేశద్వారంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి

మరోవైపు రాయపూడి నుంచి మూలపాడు వరకు కృష్ణానది మీద ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు డీపీఆర్ రూపొందించడానికి కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు కూడా పిలిచారు.

శాఖమూరు నుంచి రాయపూడి వరకు నిర్మిస్తున్న 13వ నెంబర్ జాతీయ రహదారిని మూలపాడు వద్ద మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారితో అనుసంధానించనున్నారు. ఇందుకోసం 5.2 కిలోమీటర్ల మేరకు ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు.

మొత్తంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులను మూడేళ్లలోగా పూర్తిచేసి, ఆంధ్రుల రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Leave a Reply