మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని చిన్న ముష్టూర్ గ్రామ సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ హనుమంతరాయుడు తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మిగిలి ఉన్న సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఈ నెల 24న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.
ప్రవేశ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 25న ప్రకటిస్తామని, సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు ప్రవేశ ప్రక్రియను ఈ నెల 26న నిర్వహిస్తామని వివరించారు.
విద్యార్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మిగిలిన ఖాళీలను స్థానిక, స్థానికేతర అభ్యర్థుల నుంచి నిబంధనల ప్రకారం భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ హనుమంతరాయుడు కోరారు.
