AppleTime | ఎప్పుడు తింటే మంచిది? ఆరోగ్య నిపుణుల సూచనలు ఇవే

AppleTime | ఎప్పుడు తింటే మంచిది? ఆరోగ్య నిపుణుల సూచనలు ఇవే

AppleTime | టిఫిన్‌కు ముందు లేదా తర్వాత యాపిల్ తినాలా?
భోజనానికి ముందు యాపిల్ తినడం వల్ల లాభాలు
భోజనం తర్వాత యాపిల్ తింటే ఏమవుతుంది?
రాత్రి యాపిల్ తినడం మంచిదేనా?
యాపిల్ ముక్కలుగా తినాలా? జ్యూస్ చేసుకోవాలా?
డయాబెటిస్ ఉన్నవారు యాపిల్ ఎలా తీసుకోవాలి?


AppleTime | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రోజుకొక యాపిల్ తింటే, డాక్టర్ ను దూరంగా ఉంచవచ్చు” అనే మాట మనకు తెలిసినదే. అయితే, నిజంగా యాపిల్‌ను ఎప్పుడు తినాలి?, ఎలా తింటే ఆరోగ్యపరంగా మంచి జరుగుతుందన్న Secret చాలా మందికి స్పష్టత ఉండకపోవచ్చు.
ఏ వేళలో తినాలి? ఉదయమా, భోజనం తర్వాత తినొచ్చా? లేక ఉదయాన్నే పరగడుపున తినడం మంచిదా? యాపిల్ ని అలాగే తింటే మంచిదా? లేక జ్యూస్ చేసుకుని తాగడం వల్ల ప్రయోజనం కలుగుతుందా? అనే అనేకమైన సందేహాలు చాలామందిలో. వీటికి ఇప్పుడు స్పష్టమైన సమాధానాలు ఏమిటో చూద్దాం.

యాపిల్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి.

AppleTime
AppleTime

ఉదయాన్నే పరగడుపున యాపిల్ తినవచ్చు, అయితే, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరం. అవేమిటంటే, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ, గ్యాస్ ఎక్కువగా వచ్చే వాళ్లు ఉదయం ఖాళీ కడుపుతో యాపిల్ తినడం అసౌకర్యంగా అనిపించే అవకాశాలున్నాయి. అలాంటి ప్రాబ్లెంస్ వారు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత, లేదా కాస్త ఉదయానికీ, మధ్యాహ్నానికీ మధ్యలో అంటే 10-11 గంటల ప్రాంతంలో తినడం Ultimate.

ఇలాంటి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లెం స్ లేనివాళ్ళు టిఫిన్‌కు ముందే తినడం మంచిదే. ఉదయం టిఫిన్‌కు 30 నిమిషాల ముందు యాపిల్ తింటే, ఏం జరుగుతుందంటే…ఆకలి నియంత్రణలో ఉంటుంది, అతిగా తినే అలవాటు నెమ్మదిగా తగ్గుతుంది. బరువు తగ్గడంలో Guaranteed గా
తోడ్పడుతుంది. అదే టిఫిన్ చేసిన వెంటనే యాపిల్ తింటే జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. కాబట్టి టిఫిన్ తర్వాత యాపిల్ తినడానికి కనీసం ఒక గంట గ్యాప్ ?ఉంటే బెటర్.
మధ్యాహ్నం భోజనానికి ముందు యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే యాపిల్ లో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దాంతో భోజనం అధిక మొత్తంలో తినకుండా నియంత్రిస్తుంది.
భోజనం చేసిన వెంటనే యాపిల్ తినడం అంతగా కరెక్ట్ కాదు. ఎందుకంటే,
జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అంతేకాక గ్యాస్ సమస్య కూడా మొదలయ్యే అవకాశం కలగొచ్చు.

AppleTime
AppleTime

అదే భోజనం తర్వాత యాపిల్ తినాలనుకుంటే, కనీసం 45 నిమిషాల నుండి ఒక గంట తర్వాత తినడం మంచిది.
ఇక రాత్రి చాలా ఆలస్యంగా యాపిల్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
కానీ డిన్నర్‌కు ఒకటి లేదా రెండూ గంటల ముందు తింటే ఎలాంటి సమస్య ఉండదు.
డిన్నర్ చేసిన వెంటనే యాపిల్ తినడం వల్ల, కడుపు ఉబ్బరంగా అనిపించడం, కడుపులో అసౌకర్యంగా అనిపించడం, పడుకున్న తర్వాత సరిగా నిద్ర పట్టకపోవడం, లాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
చాలా మందికి ఉండే మరో పెద్ద సందేహం, యాపిల్ ముక్కలుగా తినాలా? జ్యూస్ చేసుకోవాలా?
అంటే చాలా వరకు యాపిల్ ను జ్యూస్ చేసుకుని తాగడం కంటే,
ముక్కలుగా తినడమే మంచిది అని న్యూట్రిషియన్శ్ అంటారు.
ఎందుకంటే, యాపిల్ ను ముక్కలుగా కోసి తినడం వల్ల అందులోని ఫైబర్ పూర్తిగా శరీరానికి అందుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.


యాపిల్ ను నమలి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అదే యాపిల్ జ్యూస్ చేస్తే,
అందులోని ఫైబర్ శాతం తగ్గిపోతుంది. షుగర్ త్వరగా, నేరుగా శరీరంలోకి వెళ్తుంది.
అయితే, డయాబెటిస్ ఉన్నవారికి మాత్రం ఇలా జ్యూస్ తాగడం అంత మంచిది కాదు.
డయాబెటిస్ ఉన్నవారు అత్యవసరమై, జ్యూస్ చేసుకునేటప్పుడు షుగర్ కలపకుండా, గుజ్జుతో కలిపి తాగడం మంచిది. యాపిల్‌ను సరైన సమయంలో, సరైన విధంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు అందుతాయి. చిన్న యాపిల్ తో పెద్ద ఫలితాలు పొందవచ్చు.

(ఈవ్యాసం పాఠకుల ప్రాధమిక అవగాహన కొరకు మాత్రమే అందించబడుతోంది. శాస్త్రీయమైన, పూర్తి వివరాలు, సరైన సలహా కోసం నిపుణులను సంప్రదించడం మంచిది)

click here to read more

#ఆరోగ్యకరం

Leave a Reply