ఎలక్ట్రిక్ బస్సులో మంటలు…
అప్రమత్తమైన అధికారులు
త్రుటిలో తప్పిన ప్రమాదం
కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ: ఎలక్ట్రిక్ బస్సులో మంటలు వచ్చాయి. బుధవారం తెల్లవారుజామున కరీంనగర్ ఆర్టీసీ బస్సు ప్రాంగణంలో కరీంనగర్ 2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది బస్సులో మంటలను ఆర్పి వేశారు. అధికారుల అప్రమత్తలతో పెను ప్రమాదం తప్పింది.
