రోడ్డు దాటుతుండగా లారీ ఢీ.. వ్యక్తి దుర్మరణం
ఏటూరునాగారం, ఆంధ్రప్రభ: ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న సమయంలో లారీ ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.
మృతుడిని చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ (45)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
