ఘంటసాల మండలంలో నూతన స్పౌజ్ పింఛన్ల పంపిణీ

ఘంటసాల, ఆంధ్రప్రభ: ఘంటసాల మండలంలో నూతనంగా మంజూరైన స్పౌజ్ పింఛన్లను బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు అందజేశారు. మండలంలో మొత్తం 11 స్పౌజ్ పింఛన్లు మంజూరు కాగా, ఎంపీడీవో సుబ్బారావు, టీడీపీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరిబాబు, జనసేన మండల అధ్యక్షుడు కోన రాజశేఖర్ లబ్ధిదారులకు పింఛన్ నగదును పంపిణీ చేశారు.

ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామానికి చెందిన బండారుపల్లి సీతారత్నంకు మంజూరైన స్పౌజ్ పింఛన్‌ను టీడీపీ సీనియర్ నాయకుడు పరుచూరి సుభాష్ చంద్రబోస్, ఎంపీడీవో సుబ్బారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యార్లగడ్డ వీరభద్రరావు, సూరపనేని శివరామప్రసాద్ పాల్గొన్నారు. అలాగే పాపవినాశనం గ్రామానికి చెందిన గొరిపర్తి సీతమ్మకు మంజూరైన స్పౌజ్ పింఛన్‌ను నీటి సంఘం అధ్యక్షుడు బోయిన మణి, టీడీపీ నాయకులు సుంకర ప్రవీణ్, కుంపటి చిట్టిబాబు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టి. రాజశేఖర్, సచివాలయ ఉద్యోగి మట్టా తేజస్వి తదితరులు పాల్గొన్నారు.