Apple Siri AI | యాపిల్ నుంచి కొత్త ఏఐ అసిస్టెంట్
Apple Siri AI | యాపిల్ నుంచి కొత్త ఏఐ అసిస్టెంట్
Apple Siri AI | డబ్ల్యూడబ్ల్యూడీసీ26లో కొత్త సిరి AI ప్రదర్శన..
iOS 27, iPadOS 27, macOS 27లో కీలక మార్పులు
Apple Siri AI | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మీకు ఐ ఫోన్ వాడుతున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్.. ఇప్పుడు మీ సిరి రూపం మారనుంది. ఏంటీ రూపమా.. సిరికి రూపం ఏంటీ అనుకుంటున్నారా.. అదే లేదండీ ఇప్పుడు మీ ఐ ఫోన్ లో వాడే సిరి అప్డేట్ కానుంది. అవునూ.. ఇప్పటి వరకు మీ మాటలను వింటూ… మీకు సమాధానాలు ఇచ్చిన సిరి. ఇక నుంచి మీ ఫోన్ స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని అర్థం చేసుకుంటుంది. అంతే కాదు.. యాప్‌లలోని వ్యక్తిగత సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోవడం, అవసరమైనప్పుడు తాజా వెబ్ సమాచారాన్ని సేకరించడం మీకు అందిస్తుంది. యూజర్లు సిరితో జరిపిన సంభాషణలను ఒకేచోట కొనసాగించేందుకు ప్రత్యేక సిరి యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.
టెక్ దిగ్గజం యాపిల్ తన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 26 వేదికగా తదుపరి తరం యాపిల్ ఇంటలీజెన్స్ ఫీచర్లను ప్రదర్శించింది. ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది కొత్తగా పున: రూపొందించిన సిరి AI. ఇప్పటివరకు వాయిస్ అసిస్టెంట్‌గా మాత్రమే ఎక్కువగా కనిపించిన సిరి.. ఇకపై స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని అర్థం చేసుకోవడం, యాప్‌లలోని వ్యక్తిగత సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోవడం, అవసరమైనప్పుడు తాజా వెబ్ సమాచారాన్ని సేకరించడం వంటి సామర్థ్యాలతో మరింత శక్తివంతంగా మారనుంది.
యాపిల్ కొత్త సిరి AIని iOS 27, iPadOS 27, macOS 27 Golden Gate వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లలో అంతర్భాగంగా తీసుకురానుంది. అంతేకాకుండా, యూజర్లు సిరితో జరిపిన సంభాషణలను ఒకేచోట కొనసాగించేందుకు ప్రత్యేక సిరి యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెక్ నివేదికలు పేర్కొంటున్నాయి.
కొత్త సిరి ప్రత్యేకతలు..
కొత్త సిరి ఏఐ ప్రత్యేకతల్లో ముఖ్యమైనది ఆన్ స్క్రీన్ ఆవేర్నెస్ on-screen awareness. యూర్ తన స్క్రీన్‌పై ఏ సమాచారం చూస్తున్నాడో సిరి అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా సహాయం చేస్తుంది. ఒక ఉదాహరణకు, మెయిల్, మెసేజ్, ఫోటోలు, క్యాలెండర్, డాక్యుమెంట్లు వంటి యాప్‌లలోని సందర్భాన్ని బట్టి సమాధానాలు ఇవ్వడం, అవసరమైన పనులు చేయడం వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
ఇది కేవలం సాధారణ వాయిస్ కమాండ్ అసిస్టెంట్‌గా కాకుండా, యూజర్ ఉపయోగిస్తున్న యాప్‌లు, అందులోని సమాచారం, సందర్భం అన్నింటినీ కలిపి పనిచేసే సిస్టమ్ స్థాయి ఏఐ అసిస్టెంట్‌గా మారే అవకాశం ఉంది.
జెమిని మోడల్‌పై ఆసక్తికర చర్చ..
కొన్ని అంతర్జాతీయ టెక్ మీడియా నివేదికల ప్రకారం.. యాపిల్ ఈ కొత్త సిరి AIలో గుగూల్ ప్రాధాన్యంగా ఉంచుతూ.. ఆన్ డివైజ్ ప్రోసెసింగ్ క్లౌడ్-ఆధారిత కృత్రిమ మేధస్సు మధ్య సమతుల్యత పాటించేలా కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
యూజర్ డేటా భద్రత విషయంలో యాపిల్ ఎప్పటిలాగే ప్రైవెట్ సెఫ్టీ అప్రోచ్‌ను కొనసాగించనుందని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే యూజర్ వ్యక్తిగత సమాచారం అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా, పరికరంలోనే ఎక్కువ ప్రాసెసింగ్ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
డెవలపర్లకు కొత్త ఫ్రేమ్‌వర్క్‌లు..
సిరి AI మరింత సమర్థంగా పనిచేయాలంటే యాప్‌లలోని కంటెంట్, చర్యలు సిరికి అర్థమయ్యేలా ఉండాలి. అందుకోసం యాపిల్ కొత్తగా విస్తరించిన డెవలపర్ ఫ్రేమ్‌వర్క్‌లను పరిచయం చేసినట్లు టెక్ నివేదికలు చెబుతున్నాయి.
ఇందులో App Entities, App Intents, App Schemas, View Annotations వంటి ఫ్రేమ్‌వర్క్‌లు కీలకంగా ఉండనున్నాయి. వీటి ద్వారా యాప్‌లలోని డేటా, ఆప్షన్లు, యాక్షన్లు సిరి AIకి అందుబాటులోకి వస్తాయి. ఉదాహరణకు, ఒక యాప్‌లోని డాక్యుమెంట్‌ను కనుగొనడం, క్యాలెండర్ ఈవెంట్‌ను మార్చడం, మెసేజ్‌ను సారాంశం చేయడం, టాస్క్‌ను పూర్తి చేయడం వంటి పనులను సిరితో చేయించే అవకాశం ఉంటుంది.
యాప్‌ల పని తీరు మారనుందా?
కొత్త సిరి AI వల్ల యాప్‌ల వినియోగ పద్ధతిలో పెద్ద మార్పులు రావచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం యూజర్లు ప్రతి పనికి ఆయా యాప్‌లను ఓపెన్ చేసి చేయాల్సి వస్తోంది. కానీ సిరి AI సిస్టమ్ స్థాయిలో యాప్‌లతో అనుసంధానమైతే, యూజర్ ఒక్క కమాండ్‌తో అనేక పనులను పూర్తి చేయగలడు.
ఇది డెవలపర్లకు కూడా కొత్త బాధ్యతను తీసుకురానుంది. తమ యాప్‌లలోని కంటెంట్ సిరికి సరిగా కనిపించేలా, యూజర్ అనుమతులు స్పష్టంగా ఉండేలా, గోప్యతా నియమాలు పాటించేలా యాప్‌లను రూపొందించాల్సి ఉంటుంది.
బీటా విడుదల ఎప్పుడు?
కొత్త సిరి AI ఫీచర్లు ఈ ఏడాది చివర్లో పబ్లిక్ బీటా రూపంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. పూర్తి స్థాయి విడుదల మాత్రం సాధారణంగా వర్షాకాలంలో వచ్చే iOS, iPadOS, macOS అప్డేట్లతో కలిసి జరిగే అవకాశం ఉంది.
అయితే అన్ని ఫీచర్లు అన్ని ప్రాంతాల్లో ఒకేసారి అందుబాటులోకి వస్తాయా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొన్ని దేశాల్లో నియంత్రణలు, గోప్యతా నిబంధనలు, స్థానిక చట్టాల కారణంగా కొన్ని ఫీచర్ల విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
AI పోటీలో యాపిల్ కొత్త అడుగు..
ఇప్పటికే Google Gemini, OpenAI ChatGPT, Microsoft Copilot వంటి ఏఐ సేవలు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ కూడా తన ఎకోసిస్టమ్‌కు సరిపోయేలా సిరిని పూర్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్ వంటి పరికరాల్లో Siri AI మరింత లోతుగా పనిచేస్తే, యాపిల్ యూజర్లకు ఇది పెద్ద మార్పుగా మారవచ్చు.
మొత్తానికి డబ్ల్యూడబ్ల్యూడీసీలో పరిచయమైన కొత్త సిరిAI, యాపిల్ ఏఐ ప్రయాణంలో కీలక మలుపుగా కనిపిస్తోంది. ఇది నిజంగా యూజర్ల రోజువారీ పనులను సులభతరం చేస్తుందా? డెవలపర్లు ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌లను ఎంత త్వరగా స్వీకరిస్తారు? Gemini ఆధారిత టెక్నాలజీపై వస్తున్న నివేదికలపై యాపిల్ ఎలా స్పందిస్తుంది? అన్న ప్రశ్నలకు రానున్న బీటా విడుదలలతో మరింత స్పష్టత రానుంది.
