mla health|యశోదలో కేటీఆర్ ప‌రామ‌ర్శ‌

mla health|యశోదలో కేటీఆర్ ప‌రామ‌ర్శ‌

ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో కేటీఆర్ చర్చ
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేటీఆర్
మెరుగైన చికిత్స అందించాల‌ని సూచ‌న‌
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో:, ఆంధ్ర‌ప్ర‌భ : సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, సి. లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేటీఆర్ ఆస్పత్రిని సందర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు.

పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇప్పటివరకు అందించిన చికిత్స, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కేటీఆర్‌కు వివరించారు. అవసరమైన అన్ని రకాల అత్యుత్తమ వైద్య సేవలు అందించి ఆయన త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ వైద్యులను ప్రత్యేకంగా కోరారు.