Supreme Court | మత మార్పిడిపై కీలక తీర్పు..

Supreme Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) హోదా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన ధర్మాసనం, రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందినవారికే ఎస్సీ హోదా వర్తిస్తుందని పేర్కొంది.

ఇతర మతాల్లోకి మారిన తర్వాత ఎస్సీ హోదా కొనసాగదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఒకవేళ తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి మారితే, అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ హోదా పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ఉందని పేర్కొంటూ దానిని సమర్థించింది.