ఉత్తమ పోలీస్ సేవలు అందించడం లక్ష్యం
జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి
నరసరావుపేట, ఆంధ్రప్రభ: పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించి ఉత్తమ పోలీస్ సేవలు అందించడం లక్ష్యం అని జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
పిజిఆర్ఎస్ లో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పలు మోసాలకు సంబంధించిన సమస్యలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి పలు అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు పోలీస్ అధికారికి అందజేయగా,వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని సంబంధిత పోలీస్ అధికారులకు వాటిని రిఫర్ చేశారు. పిజిఆర్ఎస్ లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించి,క్షేత్రస్థాయిలో విచారణ వేగవంతం చేసి, చట్ట ప్రకారం వారికి న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.
పిజిఆర్ఎస్ లో తమ సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలకు వాటిని రాసి పెట్టడం లో సిబ్బంది సహాయ, సహకారాలు అందించారు.
