పీఎంఏజీవై పథకం పై సమీక్షించిన జిల్లా కలెక్టర్
నరసరావుపేట, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కు సంబంధించి మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పల్నాడు జిల్లా పిఎంఏజీవై పథకం కు సంబంధించిన పనుల పురోగతిపై అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పిఎంజివై నోడల్ ఆఫీసర్ అయిన జిల్లా పరిషత్ సీఈవో వి జ్యోతి బసు మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు 65 పనులకు గాను 2 కోట్ల 94 లక్షలు నిధులు మంజూరయ్యాయని టెండర్లు పిలిచి పనులు అప్పగించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 45 రోజులలోపు పనులు పూర్తిచేసి పేమెంట్ కూడా అందచేయాలని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మయ్య, ఈ ఈ ఆర్డబ్ల్యూఎస్, ఈ ఈ పంచాయతీరాజ్ , డి .ఈ ఎలక్ట్రిసిటీ, రొంపిచర్ల, చిలకలూరిపేట, నూజెండ్ల, క్రోసూరు , ఎడ్లపాడు, ముప్పాళ్ళ ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
