గుంటూరు జిల్లా STEP సీఈవోగా పి.వి.ఎన్. సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ
గుంటూరు, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.47 (24-07-2026) మేరకు పి.వి.ఎన్. సత్యనారాయణ సోమవారం గుంటూరు జిల్లా శిక్షణ, ఉపాధి ప్రోత్సాహక సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలోని యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు సంబంధించిన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని పి.వి.ఎన్. సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ పథకాలను యువతకు చేరువ చేసి, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సంస్థ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.
