అర్హులైన గిరిజనులకు ఫలాలు అందేలా చూడాలి
జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
\
నరసరావుపేట,ఆంధ్రప్రభ: స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. నఈ సమావేశంలో అటవీ హక్కుల చట్టం అమలు, గిరిజనులకు హక్కు పత్రాల మంజూరు మరియు సంబంధిత సంక్షేమ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ గిరిజన రైతుల దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు. అర్హులైన గిరిజనులకు ఫలాలు అందేలా భూముల పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారిణి కృష్ణ ప్రియ, జిల్లా గిరిజన సంక్షేమాధికారి వి గోవింద్ నాయక్, వివిధ డివిజన్ల అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్లు, ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
