ministers| కోమటిరెడ్డిని కలిసిన సీతక్క
ministers| కోమటిరెడ్డిని కలిసిన సీతక్క
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర సచివాలయంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లాలో రహదారుల అభివృద్ధి, మేడారం రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అంశాలపై ఇద్దరు మంత్రులు చర్చించారు. ములుగు జిల్లాలో ఆర్అండ్బీ ఆధ్వర్యంలోని రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
అలాగే, మేడారంలో సమ్మక్క–సారలమ్మ జాతరకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదించిన రింగ్ రోడ్డు నిర్మాణంపై కూడా సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలపై ఇద్దరు మంత్రులు చర్చించినట్లు సమాచారం.
