APDeputySpeaker | రఘురామకృష్ణరాజుకు ఇంద్రకీలాద్రిలో ఘన స్వాగతం
APDeputySpeaker | రఘురామకృష్ణరాజుకు ఇంద్రకీలాద్రిలో ఘన స్వాగతం
APDeputySpeaker | ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన చైర్మన్ రాధాకృష్ణ (గాంధీ), ఈవో సీనా నాయక్
అమ్మవారికి ప్రత్యేక పూజలు..
రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు
APDeputySpeaker | ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు సందర్శించి శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ స్పీకర్ ఆలయానికి చేరుకున్న సందర్భంగా దేవస్థానం చైర్మన్ శ్రీ రాధాకృష్ణ (గాంధీ), దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వేద ఆశీర్వచనం అందజేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజుకు దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దుర్గగుడి ఈవో శీనా నాయక్ అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, అభివృద్ధి, ఆయురారోగ్యాల కోసం అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

