11yearold | నిజం ఒప్పుకున్న నిందితుడు

11yearsold | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాన్పూర్ లోని మహారాజ్‌పూర్ గురుకులంలో 11ఏళ్ల దివ్యాంశ్ అనే బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. పోస్ట్‌మార్టం నివేదికలో బయటపడిన వివరాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి.
పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం… బాలుడి శరీరంపై 42 తీవ్రమైన గాయాలు, 11 చోట్ల సిగరెట్‌తో కాల్చిన గుర్తులు ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా, గురుకుల నిర్వాహకుడు, బాలుడి మేనమామ అయిన సౌరభ్ మిశ్రా దారుణ హింసకు పాల్పడినట్లు తేలింది.
బాలుడిని గంటల తరబడి ఎండలో నిలబెట్టి, రాత్రంతా కొట్టి చంపినట్లు సౌరభ్ మిశ్రా విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. అలాగే సీసీటీవీ ఫుటేజీని తొలగించడంలో అతని ప్రియురాలు ప్రియాంక ప్రమేయం ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. నిందితుడు సౌరభ్‌ను అరెస్టు చేసి, కేసుపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
