46,343People | మండుటెండలను లెక్కచేయని భక్తజనం..

46,343People | మండుటెండలను లెక్కచేయని భక్తజనం..

46,343People | ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
మంగళవారం కావడంతో అమ్మవారి దర్శనానికి భారీ రద్దీ
నిన్న ఒక్కరోజే 46,343 మంది భక్తుల దర్శనం
రూ.4.17 లక్షలకుపైగా హుండీ, విరాళాల ఆదాయం
72,918 ప్రసాదాల విక్రయం.. 7,500 మందికి అన్నదానం

46,343People | ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి మంగళవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. మంగళవారం అమ్మవారికి ప్రత్యేకమైన రోజు కావడంతో జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ సమాచారం ఇలా…

దేవస్థానం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఒక్కరోజే 46,343 మంది భక్తులు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. దర్శన టికెట్ల ద్వారా 6,756 టికెట్లు జారీ కాగా, ఇందులో 4,449 నగదు, 2,307 ఆన్‌లైన్ టికెట్లు ఉన్నాయి. ప్రసాదాల విక్రయాలు కూడా గణనీయంగా నమోదయ్యాయి. మొత్తం 72,918 ప్రసాదాల ను భక్తులకు అందజేయగా, వాటిలో 59,864 నగదు ద్వారా, 13,054 ఆన్‌లైన్ ద్వారా విక్రయించబడ్డాయి. భక్తులు సమర్పించిన విరాళాల రూపంలో దేవస్థానానికి రూ.4,17,027 ఆదాయం లభించింది. అదేవిధంగా వివిధ ఆర్జిత సేవల్లో 459 మంది భక్తులు పాల్గొనగా, 1,399 మంది తలనీలాలు సమర్పించారు. దేవస్థానం నిర్వహించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో 7,500 మంది భక్తులు ప్రసాద భోజనం స్వీకరించారు.

ఎండలను సైతం లెక్కచేయకుండా…

మండుతున్న ఎండలు, ఉక్కపోతను సైతం అధిగమిస్తూ భక్తులు అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలిరావడం ఇంద్రకీలాద్రిపై నెలకొన్న ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనంగా నిలిచింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనాలను సాఫీగా నిర్వహించారు.

CLICK HERE TO READ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

CLICK HERE TO READ MORE

Leave a Reply