AP | గోనెగండ్లలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి

గోనెగండ్ల, (ఆంధ్రప్రభ) : వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులతో పాటు పొలానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఈత కోసం నీటి ట్యాంకులో దిగి మృతిచెందారు. ఈ విషాద ఘటన గోనెగండ్ల మండల కేంద్రములో శుక్రవారం చోటుచేసుకుంది.

తల్లిదండ్రులు పొలం పనిలో ఉన్న సమయంలో సరదాగా ఆడుకుంటూ పక్కనే ఉన్న నీటి ట్యాంకులో ఈత కొట్టడానికి దిగిన బోయ మాధవి (13), బోయ మంజుల (14)… ట్యాంకు లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు.

పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకగా.. నీటి ట్యాంకులో వారి మృతదేహాలు తేలడంతో కన్నీరు మున్నీరయ్యారు. పక్కపక్కన కుటుంబాలకు చెందిన చిన్నారుల ఇద్దరూ ఒక్కసారిగా మృతిచెందటంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది.

Leave a Reply