us-iran-talks-halted-hormuz-strait-oil-crisis I 2626 I హోర్ముజ్ కు మ‌ళ్లీ తాళం?

us-iran-talks-halted-hormuz-strait-oil-crisis I 2626 I హోర్ముజ్ కు మ‌ళ్లీ తాళం?

us-iran-talks-halted-hormuz-strait-oil-crisis I 2626 I హోర్ముజ్ జలసంధి మూసివేత హెచ్చరికతో ప్రపంచ ఆందోళన
ఇజ్రాయెల్ చర్యలతో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు బ్రేక్
ప్రపంచ చమురు సరఫరాపై హోర్ముజ్ సంక్షోభం ప్రభావం
లెబనాన్ ఘర్షణల నేపథ్యంలో పెరుగుతున్న మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు
అమెరికా వైఖరిపై ఇరాన్ తీవ్ర అసంతృప్తి
తరచూ మారుతున్న షరతులపై ట్రంప్ ప్రభుత్వంపై ఆరోపణలు
ఇరాన్ హక్కులకు భంగం కలిగించే ఒప్పందాలకు నో
ప్రాంతీయ యుద్ధ భయాలతో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు
నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం వెనుక కారణాలేమిటి?
ఇజ్రాయెల్-లెబనాన్ ఘర్షణలు దౌత్య ప్రయత్నాలకు అడ్డంకా
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తాజా పరిణామాలు
శాంతి చర్చలు పునఃప్రారంభమవుతాయా? లేక సంక్షోభం మరింత ముదురుతుందా?

us-iran-talks-halted-hormuz-strait-oil-crisis I 2626 Iఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, అంత‌ర్జాతీయం : అమెరికా, ఇరాన్ మ‌ధ్య జ‌రుగుతున్న ప‌రోక్ష శాంతి చ‌ర్చ‌లు నిలిచిపోయాయి. లెబ‌నాన్‌పై ఇజ్రాయెల్ సేన దాడులు.. అమెరికా త‌ర‌చూ మాట‌మార్చ‌డం త‌దిత‌ర అంశాలు నేప‌థ్యంలో చ‌ర్చ‌లు నిలిపి వేస్తున్న‌ట్లు ఇరాన్ ప్ర‌క‌టించింది. అలాగే ఇజ్రాయెల్ సైనిక చ‌ర్య ఆప‌క‌పోతే హోర్ముజ్ జ‌ల సంధి మూసివేస్తామ‌ని కూడా హెచ్చ‌రించింది. హోర్ముజ్ మ‌ళ్లీ మూసివేస్తే అంత‌ర్జాతీయ స్థాయిలో ఆయిల్ సంక్షోభం త‌ల‌త్తే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి. ఇదే క్ర‌మంలో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్ తీరును ఎండ‌గ‌ట్టారు. ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెతన్యాహుపై ట్రంప్ అసహనాన్ని వెల్ల‌డించారు. నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి… నేను నిన్ను కాపాడుతున్నా.. ఇప్పుడు నీ వల్ల ఇజ్రాయెల్‌ను కూడా అందరూ ద్వేషిస్తున్నార‌ని ట్రంప్ అన్న‌ట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. అలాగే ఇజ్రాయెల్ తీరుతో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఇరాన్ కూడా మండిప‌డింది. ప్రాంతీయ యుద్ధాల‌కు దారితీసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

us-iran-talks-halted-hormuz-strait-oil-crisis I 2626 I హోర్ముజ్ మూసివేస్తే…
మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొన‌సాగుతున్నాయి. ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసే అవకాశం ఉందని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. బాబ్ అల్-మందెబ్ జలసంధి వంటి ఇతర వ్యూహాత్మక సముద్ర మార్గాలపై కూడా ఒత్తిడి పెంచుతామని సంకేతాలు ఇచ్చింది. ఒక వేళ హోర్ముజ్ మూసివేస్తే అంత‌ర్జాతీయ స్థాయిలో ఆయిల్ సంక్షోభం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి.

Also Read : కాల్పుల విర‌మ‌ణ‌పై మ‌ళ్లీ సందేహాలు

ఇరాన్ చేసిన ఈ హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. ముఖ్యంగా చమురు మార్కెట్లు, అంతర్జాతీయ నౌకా రవాణా రంగం, అలాగే మధ్యప్రాచ్య దేశాల భద్రతా పరిస్థితులపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత ముఖ్యమైన మార్గం. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో 40 శాతం ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేస్తే ప్ర‌పంచంలో ఆయిల్ సంక్షోభం త‌లెత్తుతుంది.

us-iran-talks-halted-hormuz-strait-oil-crisis I 2626 I అమెరికాతో చర్చలు నిలిపివేసిన ఇరాన్
ఇరాన్ ప్రభుత్వం అమెరికాతో కొనసాగుతున్న పరోక్ష చ‌ర్చ‌లు తాత్కాలికంగా నిలిపి వేసింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతుండటం, కాల్పుల విరమణ ఒప్పందాలను పదేపదే ఉల్లంఘించడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ప్ర‌క‌టించింది. ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. ముఖ్యంగా హిజ్బుల్లా, ఇజ్రాయెల్ బలగాల మధ్య దాడులు కొనసాగుతుండటంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

us-iran-talks-halted-hormuz-strait-oil-crisis I 2626 I ప్రాంతీయ యుద్ధ భయాలు
ఇరాన్ హెచ్చరికలు, ఇజ్రాయెల్-లెబనాన్ ఘర్షణలు, అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు నిలిచిపోవడం వంటి పరిణామాలు మధ్యప్రాచ్యంలో మరింత పెద్ద ఘర్షణకు దారితీయవచ్చనే ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో తాజా పరిణామాలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. ఈ ఉద్రిక్తతలు కొనసాగితే ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం, సముద్ర రవాణా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

us-iran-talks-halted-hormuz-strait-oil-crisis I 2626 I చ‌ర్చ‌లు మ‌ళ్లీ ప్రారంభ‌మ‌వుతాయా? లేదా?
ప్రస్తుతం అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. దౌత్యపరమైన చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయా? లేక ఉద్రిక్తతలు మరింత పెరిగి ప్రాంతీయ యుద్ధంగా మారుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలపై ఇరాన్ ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. చర్చల ప్రక్రియలో అమెరికా తరచుగా తన వైఖరిని మార్చుకుంటూ కొత్త షరతులు పెట్టడం వల్ల చర్చలు జాప్య‌మ‌వుతున్నాయ‌ని ఇరాన్ ఆరోపించింది. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఇజ్రాయెల్-లెబనాన్ ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, అమెరికా “పలుమార్లు తన అభిప్రాయాలను మార్చడం, పరస్పర విరుద్ధమైన డిమాండ్లు పెట్టడం” వల్ల శాంతి చర్చలు ముందుకు సాగడం లేదని తెలిపారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే చర్చల ప్రక్రియ మరింత ఆలస్యం కావడమే కాకుండా విశ్వాసం కూడా దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.

us-iran-talks-halted-hormuz-strait-oil-crisis I 2626 I ఇరాన్ హ‌క్కులకు భంగం క‌లిగే ఏ ఒప్పందాన్ని అంగీక‌రించం
ఇదే సమయంలో ఇరాన్ ప్రధాన చర్చకర్త కూడా స్పందిస్తూ, ఇరాన్ హక్కులు పూర్తిగా రక్షించబడే వరకు ఏ ఒప్పందానికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. దేశ భద్రత, అణు కార్యక్రమంపై తమ హక్కులను కాపాడుకోవడం ముఖ్యమని ఆయన తెలిపారు.
అమెరికా వైపు నుంచి ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ తాజా వ్యాఖ్యలతో చర్చల భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడింది.

us-iran-talks-halted-hormuz-strait-oil-crisis I 2626 I ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్యాహుపై ట్రంప్ మండిపాటు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరి మధ్య నిన్న‌ జరిగిన ఫోన్ సంభాషణ తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. లెబనాన్ లో ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యలు.. ఇరాన్ ‌తో అమెరికా జరుపుతున్న కీలక చర్చలకు ఆటంకం కలిగిస్తున్నాయని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. క్రమంలో నెతన్యాహుపై ట్రంప్ అత్యంత కఠినమైన, ఘాటైన పదజాలం ఉపయోగించారని అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ సంభాషణ ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉన్న ఉద్రిక్తతలను మరోసారి బయటపెట్టింది. నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతున్నా. ఇప్పుడు నీ వల్ల ఇజ్రాయెల్‌ను కూడా అందరూ ద్వేషిస్తున్నారు’ అని ట్రంప్ అన్నట్టు అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఇజ్రాయెల్ చర్యలు ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తాయని, దౌత్యపరమైన ప్రయత్నాలను దెబ్బతీస్తాయని ట్రంప్ ఈ సందర్భంగా హెచ్చరించినట్లు సమాచారం.
లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేయడం, ముఖ్యంగా బీరూట్ శివార్లలోకి సైనిక చర్యలు విస్తరించేందుకు సిద్ధమవ్వడంతో ఈ వివాదం ముదిరింది.

Also Read సైనిక ఘ‌ర్ష‌ణ త‌ప్ప‌దా?