18ఏళ్ల భూసమస్యకు పరిష్కారం..

రైతుకు ఆన్‌లైన్ అడంగల్ అందజేత..


కర్నూలు ప్రతినిధి, జులై 31 (ఆంధ్ర‌ప్ర‌భ‌) : ఒక్క నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా గోనెగండ్ల మండల కేంద్రంలోని బాషా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో బైలుప్పల గ్రామానికి చెందిన దాసరి జాంబయ్యకు సంబంధించిన 18ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం లభించింది.

బైలుప్పల గ్రామం, సర్వే నంబర్ 403లోని 2.70 ఎకరాల వారసత్వ భూమి గత 18సంవత్సరాలుగా పొరపాటున ఇనాం భూమిగా నమోదై ఉండటంతో జాంబయ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్పందించి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు రికార్డులను సరిచేసి సమస్యను పరిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి చేతుల మీదుగా రైతు జాంబయ్యకు ఆన్‌లైన్ అడంగల్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దాసరి జాంబయ్య మాట్లాడుతూ… 18 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న తన భూ సమస్యను పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.