హలో మాల.. చలో ఢిల్లీ… మహాధర్నాకు భారీగా తరలిరండి

ఆగస్టు 10 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు పిలుపు

అచ్చంపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న “హలో మాల.. చలో ఢిల్లీ” మహాధర్నాను విజయవంతం చేయాలని మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు.

ఈ మేరకు శనివారం అచ్చంపేట పట్టణంలోని ఆదర్శ్‌నగర్‌లోని మాల మహానాడు భవనంలో సమావేశం నిర్వహించి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అచ్చంపేట నియోజకవర్గంలోని మాలలు పెద్ద సంఖ్యలో ఢిల్లీ మహాధర్నాకు తరలిరావాలని కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చట్టంపై తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రోస్టర్ విధానం కారణంగా మాలలకు విద్య, ఉద్యోగాలు, అవకాశాల విషయంలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారం కోసం అందరూ ఐక్యంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గంధం స్వామి, గోరటి పరుశరాములు, రామస్వామి, అనిల్ కుమార్, కిన్నెర పాండు, బాలచంద్రి, గోరేటి శ్రీనివాసులు, వేదవ్యాస్, నూనె ఆనందు, సుధాకర్ బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.