వృద్ధులను పట్టించుకోవడం గొడ్డలి పార్టీకి అలవాటు లేదు..

వృద్ధులను పట్టించుకోవడం గొడ్డలి పార్టీకి అలవాటు లేదు..

పెనమలూరు, ఆంధ్రప్రభ : వృద్ధులను పట్టించుకోవడం గొడ్డలి పార్టీకి అలవాటు లేదని ఎమ్మెల్సీ అనురాధ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకిలోని సుగాలి కాలనీలో వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో కలిసి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు. కాలనీలోని వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ చంద్రబాబు చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనురాధ మాట్లాడుతూ 2024 ఎన్నికల హామీలను సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా పెన్షన్ 4000 చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో 64 లక్షల పైచిలుకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయల పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకున్న గొడ్డలి పార్టీ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ అనుకూలించకపోయిన ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి 4000 చంద్రబాబు చేశారన్నారు. చిత్తశుద్ధితో ముసలి వాళ్ళను పట్టించుకునే అలవాటు గొడ్డలి పార్టీకి లేదన్నారు. వికలాంగులకు రూ.6000, రూ.10000, రూ.15 వేలు కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందని తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న బోడే ప్రసాద్ కు అభినందనలు తెలిపారు.

Leave a Reply