ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ..

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ..
కంకిపాడు – ఆంధ్రప్రభ : కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు,ఇంటి వద్దకే చేరి పింఛన్ అందజేస్తున్న ప్రభుత్వ విధానంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ,ప్రజల సంక్షేమం మరియు సామాజిక భద్రతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
వృద్ధులు,వితంతువులు,వికలాంగులు,ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో పింఛన్ మొత్తాన్ని పెంచి అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారని,ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్ అందించే సంప్రదాయాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోందని పేర్కొన్నారు.
పింఛన్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులతో ముచ్చటించిన ఎమ్మెల్యే వారి సమస్యలను తెలుసుకుని,పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు,ప్రజల అవసరాలను గుర్తిస్తూ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
