రెండు చుక్కలతో పోలియో దూరం – వైద్యాధికారి రాధాకృష్ణ న్

శావల్యాపురం, ఆంధ్రప్రభ : ప్రతి చిన్నారికి రెండు చుక్కల పోలియో మందుతో పోలియో దూరం అవుతుందని మండల వైద్యాధికారి మాన్యం రాధాకృష్ణన్ అన్నారు. మండల కేంద్రమైన శావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం మాట్లాడారు. ఆదివారం జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మండల వ్యాప్తంగా 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు 3049 మంది ఉన్నారని వీరందరూ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలని సూచించారు.

మండల వ్యాప్తంగా 26 పోలియో బూతులు ఏర్పాటు చేయడం జరిగిందని, తమకు సమీపంలోని పోలియో బూత్‌కు వచ్చి రెండు చుక్కల పోలియో మందు వేయించుకోవాలన్నారు. చిన్నారికి సంపూర్ణ రక్షణ కొరకు రెండు చుక్కల పోలియో మందు అవసరమన్నారు. పోలియో రహిత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.