మేడారంలో అనుమానస్పదంగా యువకుడు మృతి..

తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సుమారు 30 ఏళ్ల వయస్సు గల ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.
నార్లాపూర్ ఎస్‌ఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కాఫీ రంగు ఫుల్ షర్ట్, నీలం రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఫోటోలో ఉన్న ఈ వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే నార్లాపూర్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మృతుడి గుర్తింపు లేదా ఇతర వివరాలు తెలిసిన వారు 8712630131, 8712630132 నంబర్లను సంప్రదించాలని కోరారు.
