ఉత్సాహంగా కొనసాగుతున్న సమ్మర్ క్యాంప్స్..
ఉత్సాహంగా కొనసాగుతున్న సమ్మర్ క్యాంప్స్..
రాష్ట్రవ్యాప్తంగా 1,402 వేసవి క్రీడా శిబిరాలు
1.74 లక్షల మందికి పైగా విద్యార్థుల నమోదు
రిజిస్ట్రేషన్ మరింత పెంచాలి
శాప్ చైర్మన్ ఏ రవి నాయుడు
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : శాప్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంబర్ క్యాంపులు అత్యంత ఉత్సాహకరంగా కొనసాగుతున్న ఎన్నిసార్లు చైర్మన్ ఏ రవి నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాల పురోగతిపై షాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, వైస్ చైర్మన్ ఎండీ ఎస్. భరణి, ఐఎఫ్ఎస్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 1,402 శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుండగా, ఇప్పటికే 1,74,978 మంది విద్యార్థులు క్రీడా యాప్‌లో నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో నమోదు తక్కువగా ఉండటంపై స్పందించిన చైర్మన్, ఈ నెల 10వ తేదీలోగా ప్రతి జిల్లాలో కనీసం 3 వేల నుంచి 5 వేల మంది విద్యార్థులు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రీడా సామగ్రి, పౌష్టికాహారం సకాలంలో అందేలా చూడాలని, అత్యుత్తమంగా శిబిరాలు నిర్వహించిన డి ఎస్ డి ఓ, పి ఈ టి లు, యువజన సేవల అధికారులు ప్రత్యేకంగా సత్కరించబడతారని తెలిపారు. అలాగే శిబిరాలకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని పిలుపునిచ్చారు. శిబిరాల్లో పాల్గొన్న విద్యార్థులకు ముగింపు సందర్భంగా ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
