ఇంద్రకీలాద్రిపై ‘ఎయిర్‌ఫోర్స్ బెజవాడ బ్యాచ్’
ఇంద్రకీలాద్రిపై ‘ఎయిర్‌ఫోర్స్ బెజవాడ బ్యాచ్’
-వైభవంగా చిత్ర ప్రారంభ పూజలు
-ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో కొత్త తెలుగు చిత్రం..
ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి:
విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై సోమవారం ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ఎయిరఫోర్స్ బెజవాడ బ్యాచ్ (ఎయిర్‌ఫోర్స్ బెజవాడ బ్యాచ్) తెలుగు సినిమా ప్రారంభ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ చిత్రానికి నిర్మాతగా అనిల్ సుంకర వ్యవహరిస్తుండగా, దర్శకత్వ బాధ్యతలను అనిల్ కైవల్య నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ.. విజయవాడ నగర గొప్పతనం, ప్రత్యేకతలను ప్రతిబింబించేలా నలుగురు స్నేహితుల మధ్య సాగే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందని తెలిపారు. అలాగే బెజవాడ పురాధీశ్వరి శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలనే సంకల్పంతో ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు.
