రాష్ట్ర అభివృద్ధిలో అలుపెరుగని ధీరుడు..

రాష్ట్ర అభివృద్ధిలో అలుపెరుగని ధీరుడు..
పాయకాపురం, ఆంధ్రప్రభ : రాష్ట్ర అభివృద్ధి పధంలో నడిపించడంలో అలుపెరుగని ధీరుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.స్థానిక59వ డివిజన్ సింగ్ నగర్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొని డివిజన్ అధ్యక్షుడు బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్తో కలసి కేక్ కటింగ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వింజమూరి సతీష్,దివి ఉమా, గౌసియా,రజని తదితరులు పాల్గొన్నారు.సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో జరిగిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలలో 76 చిత్రపటాలతో ప్రత్యేక ఆర్ట్ ఎగ్జిబిషన్, చంద్రబాబు జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించిన చిత్రాలు, యువతను ఆకట్టుకున్న కళా ప్రదర్శనలను చిత్రకారులకు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తిలకించారు.అనంతరం టీడీపీ శ్రేణులు సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సెంట్రల్ కార్యాలయ ఇంఛార్జి ఘంటా కృష్ణ మోహన్, పిరియా సోమేశ్వరర్రావు జగదాంబ, దాసరి కనకరావు, ఆకుల సూర్యప్రకాష్, కంచేటి నాగరాజు, డిడి నాయుడు, లక్కీశెట్టి సాయి, ఎస్ కె గౌస్ బాషా, పైడి శ్రీను, దేవర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక62వ డివిజన్ ప్రకాష్ నగర్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలలో ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొని డివిజన్ ఇంచార్జి పైడి శ్రీనుతులసిలతో కలసి కేక్ కటింగ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జలకం రాజారావు, బోను వెంకాయమ్మ,బెజ్జం జైపాల్,రౌతు మంగరాజు, జూలూరు సాయి, గోసుల రవి, ఖాదర్బీ తదితరులు పాల్గొన్నారు. స్థానిక61వ డివిజన్ శాంతి నగర్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొని డివిజన్ అధ్యక్షుడు ఆకుల సూర్యప్రకాష్, టీడీపీ శ్రేణులతో కలసి కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టోపి శ్రీను, దాసరి కనకరావు, దుర్గారావు,ఉదయ్ శ్రీ,శివకుమారి తదితరులు పాల్గొన్నారు.
