ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలి

ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలి

మల్లాయి చిట్టూరులో స్వచ్ఛరధంకు పాత సామాగ్రి అందజేసిన ప్రజలు

ఘంటసాల – ఆంధ్రప్రభ

ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి.సుబ్బారావు తెలిపారు.స్వచ్ఛ రథం ఘంటసాల మండల పరిధిలోని మల్లాయి చిట్టూరు గ్రామంలో బుధవారం పర్యటించింది.ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు పాత సామాగ్రి, పాత పుస్తకాలను స్వచ్ఛరధానికి అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పాత వస్తువులు, పాత పుస్తకాలను స్వచ్ఛరధానికి అందించి నిత్యావసర సరుకులు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బయట మార్కెట్లో కంటే ఇక్కడే ఎక్కువగా ధర జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు ఆవుల ధర్మం వెంకట నరసయ్య, మండల డిప్యూటీ ఎంపీడీవో యార్లగడ్డ శివరామ ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply