శ్రీవారిని దర్శించుకున్న కొడాలి నాని, మోహన్ మాతే..

శ్రీవారిని దర్శించుకున్న కొడాలి నాని, మోహన్ మాతే..
గుడివాడ, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొడాలి నాని, నాగ్పూర్ సౌత్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మాతే కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కొడాలి నాని, మోహన్ మాతే కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. నాని కుటుంబ సభ్యులుతో కలసి ఎమ్మెల్యే మోహన్ మాతే శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
