Anantha Babu | సాక్షులను బెదిరించినట్లు నిర్ధారణ
Anantha Babu | సాక్షులను బెదిరించినట్లు నిర్ధారణ
Anantha Babu | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది. సాక్షులను బెదిరించినట్లు ఆరోపణలు రుజువుకావడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
కేసులో కీలకమైన నలుగురు సాక్షులను అనంతబాబు బెదిరించినట్లు ఆధారాలతో నిరూపితమైందని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు చేస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
బెయిల్ రద్దు కావడంతో హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు అనంతబాబు జైలులోనే ఉండనున్నారు. ఈనెల 20వ తేదీ నుంచి డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు రెగ్యులర్ విచారణ ప్రారంభించనున్నట్లు కోర్టు వెల్లడించింది.
