విద్యార్థినులకు ఘన సన్మానం..
విద్యార్థినులకు ఘన సన్మానం..
పది పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ
ఎ.కొండూరు , ఆంధ్రప్రభ: ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మండల టిడిపి సీనియర్ నాయకులు గడ్డి కృష్ణారెడ్డి,సతీమణి రోజా రాణి శుక్రవారం శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థిని ఎం.అనూష 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి స్థానంలో నిలిచి ప్రతిభ చాటింది.అలాగే సిహెచ్ భవ్య శ్రీ (504/600) పి. కిరణ్ కుమార్ (487/600) వరుసగా రెండో,మూడో స్థానాలను సాధించి పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు.ఈ సందర్భంగా రోజారాణి మాట్లాడుతూ, విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందిస్తూ వారికి శాలువాలతో ఘనంగా సత్కరించారు.రామచంద్రాపురం హై స్కూల్ అభివృద్ధి కోసం తమ కుటుంబం ఎప్పుడూ ముందుండి సహకరిస్తుందని, భవిష్యత్తులో పాఠశాలకు ఏ అవసరం వచ్చినా తోడుగా నిలబడి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, షేక్ నిఖత్ సుల్తానా,ఎం. బసవయ్య,పి.ప్రసన్న షేక్ ఖాదర్, ఆశాజ్యోతి విద్యార్థుల, తల్లిదండ్రులు,గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
